మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20 : మ హబూబ్‌నగర్ పట్టణంలోని మినీ ట్యాం క్బండ్ అభివృద్ధిలో భాగంగా నూతనం గా సస్పెన్షన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎ క్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమావేశమయ్యా రు. పెద్ద చెరువును ఆధునికంగా అభివృ ద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌తోపాటు సై క్లింగ్, వాకింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చే యడం..
పెద్ద చెరువులోని ఐలాండ్ వర కు అత్యద్భుతంగా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు, నమూనాలను పర్యాటక శాఖ ఎండీ మ నోహర్తో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో హైదరాబాద్‌కు సమాంతరంగా అ భివృద్ధి జరుగుతుందన్నారు. మినీట్యాంక్‌బండ్ నిర్మాణం, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కాగా హన్వాడ మండలం రామన్నపల్లి గ్రామానికి చెందిన కుల్కచర్ల కేశవులుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్వోసీని వారి కుటుంబ సభ్యులకు మం త్రి అందజేశారు. కార్యక్రమాల్లో టూరి జం అధికారులు సత్యనారాయణ, ఆది ల్, నేతలు లక్ష్మయ్య, జంబులయ్య, కు ల్కచర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.