
కేటీదొడ్డి, అక్టోబర్ 29 : సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ భనాస్ పటేల్, కేటీదొడ్డి ఎస్సై కురుమయ్య హెచ్చరించారు. మండలంలోని ఇర్కిచేడు తండా, పూజారితండా గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు, కేటీదొడ్డి పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 50 లీటర్ల సారా తయారీకి ఉపయోగపడే బెల్లం పానకాన్ని(వాష్) ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మత్తు పదార్థాలు తయారు చేసేవారు, ప్రోత్సహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తయారీని నిలిపి ప్రభుత్వ సాయంతో వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు శ్రీనివాస్, మొగిలప్ప, గోవర్ధన్, చంద్రకళ, కురుమయ్య, సిబ్బంది వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.