
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 27 : అడ్డాకులతోపాటు కందూరు, శాఖాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం నిర్వహించిన కరోనా వ్యాక్సిన్ ప్రత్యేక టీకా పంపిణీ కేంద్రాలను అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. వాక్సినేషన్ వివరాలపై ఆరా తీయడంతోపాటు గ్రామాల్లో ఇంకా మిగిలిపోయిన ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా అడ్డాకులలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ సభ్యులు, అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ కిషన్, ఎంపీడీవో మంజుల, ఎంపీవో విజయకుమారి, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్, ఆ యా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల సిబ్బంది, నేతలు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన
జడ్చర్ల(బాలానగర్), అక్టోబర్ 27 : నియోజకవర్గంలోని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను బుధవారం డీఎంహెచ్‌వో కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ 18 ఏండ్లు పైబడిన వారందరూ టీకా వేయించుకోవాలని సూచించారు. మొదటి డోస్ వేసుకున్న వారు రెండో డోస్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మందిభయపడుతున్నారని, ఎలాంటి అపోహలు లేకుండా టీకా వేయించుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో 100శాతం వ్యాక్సినేషన్‌ను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటింటికీ వ్యాక్సిన్ పంపిణీ
భూత్పూర్, అక్టోబర్ 27 : కొవిడ్ వ్యాక్సిన్‌ను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నట్లు ప్రాథమిక వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. బుధవారం మండలంలోని అన్ని గ్రామాలతోపాటు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆ యన తెలిపారు. మొదటి డోస్ 383 మంది, రెం డో డోస్ 65 మందికి వేసినట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ను వేయి ంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ చెన్నకిష్టన్న, సీహెచ్‌వో రామయ్య, ఎంపీవో విజయకుమార్, రెవెన్యూ సిబ్బంది, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.