జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం | కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై పోరాటంలో ముందున్న జర్నలిస్టులను మధ్యప్రదేశ్‌లో ‘ఫ్రంట్‌లైన్ వర్కర్స్’ ప్రకటించారు.

భోపాల్ : కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై పోరాటంలో ముందున్న జర్నలిస్టులను మధ్యప్రదేశ్‌లో ‘ఫ్రంట్‌లైన్ వర్కర్స్’ ప్రకటించారు. పాత్రికేయులు కరోనాపై పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని, గుర్తింపు పొందిన వారందరినీ కరోనా యోధులుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వారిని జాగ్రత్తగా చూసుకుంటామన్నారు. ఇప్పటికే ఒడిశా బిహార్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్ సైతం ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య నిరంతరాయంగా సేవలందిస్తున్న పాత్రికేయులను కొవిడ్ యోధులుగా ప్రకటించారు.
ఈ సందర్భంగా అవిశ్రాంతంగా సమాచారం చేరవేయడంతో పాటు కొవిడ్-19 సంబంధిత అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారని ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా గత నెల రోజుల్లో 52 మంది జర్నలిస్టులు మృతి చెందారు. నెలలో సగటున ఇద్దరు జర్నలిస్టులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గతేడాది ఏప్రిల్ ఒకటి.. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ మధ్య వంద మందికిపైగా జర్నలిస్టులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్ల జాబితాలో చేర్చి, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్ల మాదిరిగా వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఎడిటర్స్ గిల్డ్ సైతం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

