హైదరాబాద్,జూలై 2(నమస్తే తెలంగాణ): చర్చకు భయపడే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయించారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిప్డడారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ వైఫల్యాలు, అవినీతి, అప్పుల అసలు లెక్కలు వెలుగులోకి వస్తాయనే రాష్ట్ర సర్కార్ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయించిందని ధ్వజమెత్తారు.
పాలకుల్లో ఉండాల్సిన లక్ష్యం కాంగ్రెస్ ముఖ్య నేతలకు లేదని, చర్చకు సవాల్ విసిరిన మంత్రులు పోలీసుల మాటున దాక్కోవడం వారి పిరికితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీస్ వ్యాన్‌లో నగరమంతా తిప్పడాన్ని ఖండించారు. గతంలో సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరించి ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ గంటల తరబడి ఎదురుచూశారని గుర్తుచేశారు. మాటతప్పడం.. మడమ తిప్పడంలో సీఎం దిట్ట అని, కాంగ్రెస్ లో మిగతా నేతలు కూడా ఆయన బాటలో నడుస్తున్నారని ఎద్దేవాచేశారు.