హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకొని పోలీస్‌స్టేషన్ హద్దులను నిర్ణయించాలని సూచించారు.
గురువారం తన కార్యాలయంలో హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పునర్వ్యవస్థీకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల భౌగోళిక, పరిపాలనా ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా పోలీస్స్టేషన్లకు తగిన పేర్లు నిర్ణయించాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి, మలాజిగిరి సీపీ సుమతి, జాయింట్ కమిషనర్లు పాల్గొన్నారు.