మునిపల్లి, నవంబర్ 9 : గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ఓ దాబా వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కథనం మేరకు వివరలు ఇలా ఉన్నాయి. ఉత్త, ప్రదేశ్ కు చెందిన రమ్ నాగిన యాదవ్ (53) శనివారం అర్ధరాత్రి సమయంలో కంకోల్ గ్రామ శివారులోని ఓ బాబా వద్ద భోజనం చెసి దాబా వద్ద లారిని నిలిపి పడుకునే క్రమంలో గుండె పోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదశివాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.