Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Lizards | ఇంట్లో బల్లులు (Lizards ) తిరుగుతుంటే మనకు ఒల్లు జలదరిస్తుంది. అవి ఇంట్లో తినే వస్తువులపై పాకుతాయేమోనని, వంటల్లో ఎక్కడ పడుతాయోనని చాలామంది భయాందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
Lizards : ఇంట్లో బల్లులు (Lizards ) తిరుగుతుంటే మనకు ఒల్లు జలదరిస్తుంది. అవి ఇంట్లో తినే వస్తువులపై పాకుతాయేమోనని, వంటల్లో ఎక్కడ పడుతాయోనని చాలామంది భయాందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, బల్లులకు పడని పదార్థాలను ఇంట్లో ఉంచడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి బల్లికి పడని ఆ పదార్థాలేమిటో, పాటించాల్సిన టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. పరిశుభ్రత
బల్లులు ఊరికెనే ఇంట్లోకి రావు. మీ ఇంట్లో ఆహారం దొరికితేనే అవి ఇంట్లో దూరుతాయి. చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని ఆహ్వానిస్తుంది. కాబట్టి బల్లులు రావద్దంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
2. నిమ్మ
నిమ్మ లాంటి సిట్రస్ జాతి మొక్కల వాసన కేవలం బల్లులే కాదు, ఏ పురుగులకు కూడా పడదు. సిట్రస్ పండ్లను, ఆకులను బల్లులు, పురుగులు అసహ్యించుకుంటాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కలనుగానీ, నిమ్మ ఆకులనుగానీ బల్లులు తిరిగేచోట పెడితే అవి రాకుండా ఉంటాయి. అంతేగాక నిమ్మగడ్డిని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేస్తే కూడా బల్లులు దరిచేరవు.
3. కర్పూరం
కర్పూరం వాసన కూడా బల్లులకు అస్సలు పడదు. కర్పూరం వాసన వాటికి ఎలర్జీ ఫీల్‌ను ఇస్తుందట. అందుకే కర్పూరానికి దూరంగా ఉంటాయట. కాబట్టి ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిళ్లలు పెడితే బల్లులు దెబ్బకు పారిపోతాయి.
4. చల్లదనం
బల్లులు చల్లదనాన్ని భరించలేవు. ఇవి ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుతాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే బల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు ఏసీని పెంచండి. దాంతో బల్లులు కనిపించకుండా పోతాయి. లేదంటే ఓ స్ప్రే బాటిల్లో చల్లటి నీళ్లు తీసుకుని వాటిపై స్ప్రే చేసినా బల్లులు పారిపోతాయి.
5. నెమలి ఈకలు
వినడానికి వింతగా ఉన్నా నెమలి ఈకలంటే బల్లులకు భయమట. కాబట్టి బల్లులు తిరిగే చోట నెమలి ఈకలను వేలాడదీస్తే అవి పత్తాలేకుండా పారిపోతాయట.
మరికొన్ని చిట్కాలు
పెప్పర్ స్ప్రే మంటను కూడా బల్లులు తట్టుకోలేవట. కాబట్టి పెప్పర్ స్ప్రేను చల్లడం ద్వారా బల్లుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
కాఫీ, తంబాకు మిక్సింగ్ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి వాటి మిశ్రమం వాసన చూపిస్తే బల్లులు పారిపోతాయట.
ఆపిల్ సైడర్ వెనిగర్ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేస్తే బల్లులు పరారవుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Watch: తండ్రి, కూతురిని కారులో వెంబడించి.. కాల్పులు జరిపిన వ్యక్తులు
Gunmaaster G9 | ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్ జి9’ ట్రైలర్ విడుదల.!
O Saathi Re | ఇంతియాజ్ అలీ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

