Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
రక్తంలోని హానికర పదార్థాలను తొలగించడం నుంచి ఆహారం జీర్ణం కావడానికి సహాయపడడం వరకు కాలేయం శరీరంలో ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది. అందుకే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఏదో ఒక ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడం లేదా ప్రత్యేక ఆహార నియమాలను పాటించడం మాత్రమే సరిపోదు.
Liver Detox | రక్తంలోని హానికర పదార్థాలను తొలగించడం నుంచి ఆహారం జీర్ణం కావడానికి సహాయపడడం వరకు కాలేయం శరీరంలో ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది. అందుకే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఏదో ఒక ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడం లేదా ప్రత్యేక ఆహార నియమాలను పాటించడం మాత్రమే సరిపోదు. రోజువారీ ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి దీర్ఘకాలంలో కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కొన్ని ఆహార పదార్థాలు కాలేయాన్ని శుభ్రం చేస్తాయని, దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి బాగు చేస్తాయని ప్రచారం జరుగుతున్నా, ఇలాంటి వాదనలన్నీ నిజం కావని నిపుణులు చెబుతున్నారు.
డీటాక్స్ ఉత్పత్తులను నమ్మవచ్చా..?
కాలేయాన్ని శుభ్రం చేస్తాయంటూ ప్రచారం చేసే డీటాక్స్ టీలు, క్లెన్సింగ్ పానీయాలను నమ్మవద్దని వారు చెబుతున్నారు. కాలేయానికి ప్రత్యేకంగా డీటాక్స్ అవసరం లేదని, శరీరంలోని హానికర పదార్థాలను తొలగించే పని కాలేయమే చేస్తుందని వివరించారు. మరోవైపు బ్లాక్ కాఫీ కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిదని దీనిని క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల కాలేయంలో మచ్చలు, గట్టిపడడం తగ్గడంతోపాటు కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. బరువులతో వ్యాయామం చేయడం కూడా కాలేయ ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఇలాంటి బలవర్ధక వ్యాయామాలు ఇన్సులిన్ పట్ల శరీర స్పందనను మెరుగుపరచి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
ప్రోటీన్లు మనకు రోజూ ఎంత అవసరం..?
శరీర బరువులో ప్రతి కిలోకు రోజుకు సుమారు 1.2 నుంచి 1.6 గ్రాముల ప్రొటీన్లు తీసుకోవాలని సూచించారు. రోజుకు 30 గ్రాముల పీచు పదార్థాలు తీసుకోవడం కూడా అవసరమని తెలిపారు. ఇవి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, కడుపు నిండిన భావన కలిగించడంలో, పేగుల్లోని మంచి సూక్ష్మజీవుల ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడతాయి. బరువు తగ్గించడంలో, ఫ్యాటీ లివర్ సమస్యను మెరుగుపరచడంలో సహాయపడే జీఎల్పీ-1 మందులను వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని స్పష్టం చేశారు. ఫ్యాటీ లివర్‌కు అశ్వగంధ మందులు నిరూపితమైన చికిత్స కాదని, అరుదైన సందర్భాల్లో కాలేయానికి హాని కలిగించినట్లు నివేదికలు ఉన్నాయని హెచ్చరించారు.
ఆరోగ్యరకరమైన అలవాట్లను పాటించాలి..
పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని సాధారణ అలవాట్ల గురించి కూడా నిపుణులు వివరించారు. మరుగుదొడ్డిలో ఎక్కువసేపు ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్ల అక్కడ గడిపే సమయం పెరిగి మూలవ్యాధి సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. మల విసర్జన సమయంలో మరీ గట్టిగా ఒత్తిడి పెట్టడం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే బీన్స్, ఇతర పప్పుధాన్యాలను ఆహారం నుంచి పూర్తిగా తొలగించకూడదు. ఇవి మంచి పేగు బ్యాక్టీరియా పెరుగుదలకు, మల విసర్జన సక్రమంగా జరగడానికి సహాయపడతాయి. పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ తోడ్పడతాయి. ప్రతిరోజూ మల విసర్జన అవుతోందని మాత్రమే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉందని భావించకూడదు. గట్టిగా ఉండే మలం, విసర్జనలో ఇబ్బంది, కడుపు పూర్తిగా ఖాళీ కాలేదనే భావన మలబద్ధకానికి సంకేతాలు అవుతాయి. ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి నొప్పి నివారణ మందులను వాడడం వల్ల కడుపులో పుండ్లు, రక్తస్రావం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
TTD EO | శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

