ఏమి చేయాలేమి చేయాలీ
జనులారా మనమూ
హైద్రబాదును దోచుకోవాలే
మన పెత్తనం పోయినంకా
హైద్రబాదు ఇంకా మెరిసె
తెలగాణ మాగాణి ఆయె
చూసి నోరూ ఊరబట్టె ॥ఏమి॥
వెనుకబడ్డా రాయలసీమను
బాగు చేసే శక్తి లేదు
చిత్తశుద్దీ బుద్ది లేదు
ఇంకా దోచనీకేమీ లేదూ ॥ఏమి॥
హైద్రబాదూ దోపకాలూ
సీమ గూండాల భూమి కబ్జలు
బినామీల దొంగ దందలు
అన్నీ ఆగె ఏమి సేతుము ॥ఏమి॥
దోచుకున్నది మింగి మింగి
ఇంకా ఇంకా మింగబుద్దయి
మళ్లా మళ్లా దోచబుద్దయి
పానమెక్కడ నిలువదాయె ॥ఏమి॥
దొంగబాబా కాషాయం వలె
మేకతోలూ పులులవోలె
ప్రజల బాగూ మంత్రం చదివీ
రాజకీయ రంగు పూసీ ॥ఏమి॥
టంకశాల అశోక్