మునిపల్లి, ఫిబ్రవరి 12 : ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు (బాయ్స్) ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య తెలిపారు. గురువారం ప్రిన్సిపాల్ మాట్లాడుతు ఇటీవల సంగారెడ్డి లో జరిగిన సీఎం కప్ పోటీల్లో లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచారని తెలిపారు.
లింగంపల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి (12)గోల్డ్ మేడల్స్,(3) సిల్వర్ మెడల్స్ సాధించారని తెలిపారు.