ముంబై: విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత క్రీడాకారులకు బీమా సంస్థ ఎల్ఐసీ ఘనంగా సత్కరించింది. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించింది. విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన ఏడుగురితో పాటు పారాలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన 19 మందిని వారి వారి సొంత నగరాల్లో ఎల్ఐసీ సన్మానించింది. నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకున్న వారి శ్రమను గుర్తించిన ఎల్ఐసీ.. నిరాశ చెందకుండా భవిష్యత్తులో పతకం సాధించాలనే ఉత్సాహాన్నందిస్తూ వారిని కూడా సత్కరించింది. దేశంలోని వివిధ నగరాల్లో అథ్లెట్లకు ఎల్ఐసీ ప్రతినిధులు గురువారం నగదు ప్రోత్సహకాలు అందించారు.