మల్కాజిగిరి, డిసెంబర్ 20: రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఈస్ట్ ఆనంద్‌బాగ్ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి మోదీ దిష్టి బొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులు బుద్ధిచెబుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు సనీతరాముయాదవ్, మీనా ఉపేందర్‌రెడ్డి, శాంతిశ్రీనివాస్‌రెడ్డి, రాజ్ జీతేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, పిట్ల శ్రీనివాస్, కొండల్‌రెడ్డి, రాయుయాదవ్, గుండా నిరంజన్, ఉపేందర్‌రెడ్డి, నర్సింగరావు, సత్యమూర్తి, సత్యనారాయణ, సురేశ్, సత్తయ్య, మోహన్‌రెడ్డి, రాం దాస్, సిద్దిరాములు, భాగ్యనందరావు, గణేశ్, పల్లె విజయకుమారి, గద్వాల జ్యోతి, అరుంధతి, కవిత,వైశాలి పాల్గొన్నారు.