హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులకు మానవ విలువలపై పాఠ్యాంశాలను బోధించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంలో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యూనివర్సల్ హ్యుమన్ వ్యాల్యూస్ పేరుతో ప్రత్యేక ప్రోగ్రాం రూపొందించింది. దీనిని బోధించే ఫ్యాకల్టీ మెంటార్లకు ఏఐసీటీఈ ఆన్లైన్లో ఐదురోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నది.