Leopard | మెదక్ : మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. తుఫ్రాన్ మండలం అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా చిరుత సంచరిస్తోంది. చిరుత సంచారంతో స్థానికులు, రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. చిరుతను బంధించాలని స్థానికులు అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాత్రిపూట ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.