Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకెళ్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల భారీ కలెక్షన్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. సినిమా విజయం తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ఓజీ సినిమా విజయోత్సవ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ చిత్రయూనిట్‌కు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
పతి సినిమాకీ చాలా హార్డ్ వర్క్ చేస్తాము, కానీ ఫలితాలు వేరేలా వస్తాయి. ఓజీ విజయానికి సుజీత్, తమన్, టీమ్ కృషే కారణం. ఇది ఒక మంత్రంలా పని చేసింది అంటూ ఆయన తెలిపారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ మెమెంటో తీసుకునేందుకు వేదికపైకి వచ్చాడు. అప్పుడు ఆయన కాళ్లకు చెప్పులు తీసేసి పవన్ కళ్యాణ్ పాదాలపై పడ్డాడు. వెంటనే పవన్ ఆయనను ఆపేసి, ‘‘వద్దు.. చెప్పులు వేసుకొని రా’’ అని చెప్పాడు. అత్తి చెప్పులు వేసుకొని వచ్చిన తర్వాతే పవన్ మెమెంటో అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్యాన్స్, నెటిజన్లు పవన్ డౌన్ టూ ఎర్త్ నేచర్‌ని ప్రశంసిస్తున్నారు. ఈ ఈవెంట్లో మరో కీలక విషయాన్ని పవన్ స్పష్టం చేశారు. ‘‘ఓజీ యూనివర్స్ కొనసాగాలా, ప్రీక్వెల్ అవుతుందా, సీక్వెల్ చేస్తామా అనే విషయం ఇంకా నిర్ణయించలేదు. ఇది సుజీత్, తమన్ వంటి టాలెంటెడ్ టీమ్‌తో చర్చించి మాత్రమే జరిగే విషయం. అయితే, కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని బట్టి ముందుకు వెళ్తాం’ అని అన్నారు. అలానే ‘ఫ్యాన్ వార్స్ ఆపేయండి. సినిమాలు మనకు వినోదం ఇవ్వడానికే. మంచి సినిమాలను చంపకండి. ప్రతి హీరోను ప్రోత్సహించండి. మనం మంచి సినిమా చూసి ఆనందించాలి. ఇండస్ట్రీ మొత్తం ముందుకెళ్లాలంటే అందరం కలిసే ముందుకు వెళ్లాలి’’ అంటూ పిలుపునిచ్చారు. సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ మళ్లీ తన స్టామినా ఏంటో నిరూపించగా, ‘ఓజీ’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో భారీ విజయం నమోదైంది.