LEGO Flower Bouquet | పూలు పూయించండి… మీ చేతితో లెగోలు ఇవిగో!
LEGO Flower Bouquet | ఇచ్చినా పుచ్చుకున్నా ఆనందాన్ని నింపే కానుకల్లో పువ్వులు మొదటి స్థానంలో ఉంటాయి. వీటిని ఇంకాస్త సృజనాత్మకంగా అందించాలనుకునే వారికోసం సరికొత్త ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి. మనసుకు సంతోషాన్నే కాదు సరదానూ ఇచ్చేలా వచ్చేస్తున్నాయి..
LEGO Flower Bouquet | ఇచ్చినా పుచ్చుకున్నా ఆనందాన్ని నింపే కానుకల్లో పువ్వులు మొదటి స్థానంలో ఉంటాయి. వీటిని ఇంకాస్త సృజనాత్మకంగా అందించాలనుకునే వారికోసం సరికొత్త ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి. మనసుకు సంతోషాన్నే కాదు సరదానూ ఇచ్చేలా వచ్చేస్తున్నాయి.. లెగో ఫ్లవర్ బొకేలు. లెగో బ్లాకులను కలుపుతూ అందమైన పుష్పగుచ్ఛాలను రూపొందించడం ఇందులోని ప్రత్యేకత. ఒక్కసారి ప్రయత్నిస్తే.. ఆ పూలతో ప్రేమలో పడటం ఖాయం.
లెగోలంటే చిన్నప్పుడు ఆడుకునే బిల్డింగ్ బ్లాకులే గుర్తొస్తాయి మనకు. విభిన్న ఆకృతులు, రంగులతో కూడిన రకరకాల ముక్కలను జతచేస్తూ ఇండ్లు తయారుచేయడం మనకు తెలిసిందే. అయితే అవి పిల్లలకు ఆట వస్తువులుగా రూపొందించినవి. ఇప్పుడు అవే లెగోలు పెద్దల కోసం మార్కెట్లోకి వస్తున్నాయి. పద్దెనిమిదేళ్లు పైబడిన వారికోసం తయారవుతున్న వీటిలో ఫ్లవర్ బొకేలతోపాటు, పూలచెట్లూ ఉంటున్నాయి.

మనసు పెట్టి..
లెగో బొకేల్లో నిజమైన పూల స్ఫూర్తితో చేసిన అనేక రకాల కృత్రిమ పుష్పాలుంటాయి. మనకు తెలిసిన మందారాలు, డైసీలు, పొద్దు తిరుగుడు, గులాబీలతోపాటు ఏస్టర్, స్నాప్‌డ్రాగన్, పాపీల్లాంటి బోలెడు పూలను లెగోల్లో తయారు చేసుకోవచ్చు. అంతేకాదు గడ్డిపోచలతోపాటు, వివిధ ఆకృతుల్లోని ఆకులూ ఇందులో ఉంటాయి. ఈ సెట్‌తోపాటు వచ్చే ఆకుపచ్చని కాడలకు ఆకులు, పువ్వులు జోడించాలి. వందల ముక్కల్లోంచి.. ఏ ముక్కను, ఎలా కలిపి పూలను తయారు చేయవచ్చో చెప్పేందుకు వీటితోపాటు ఒక పుస్తకం వస్తుంది. దాని ఆధారంగా అందమైన పువ్వుల్ని మన చేత్తో మనమే సృష్టించవచ్చు. కాడల్ని కూడా అవసరాన్ని బట్టి.. పెంచుకోచ్చు, తగ్గించుకోవచ్చు. కస్టమైజ్డ్ తరహాలో ఉంటాయి. ఫ్లవర్‌వేజ్‌లో ఎలా పెడితే అందంగా ఉంటుంది అనిపిస్తే అలా సరిచేసుకోవచ్చు. ఆర్కిడ్లు, సకురాలలాంటి పూల మొక్కల్నీ లెగో కిట్లలో తయారు చేయవచ్చు. అదనపు అందం కోసం అమెజాన్ తదితర వెబ్సైట్లలో ఎల్యీడీ లైట్ల సెట్లు దొరుకుతున్నాయి. ఇంకేముంది, మెరుపులు మెరిపించవచ్చు. నిజమైన పూలగుత్తులు చూడగానే ఆనందాన్నిస్తే, ఇవి మనల్ని పనిలో నిమగ్నం చేసి కొత్త అందాన్ని సృష్టించిన అనుభూతిని మిగిలిస్తాయి. అంతేకాదు, రంగురంగుల్లో.. విభిన్న ఆకృతులతో.. గదికి కొత్త ఆకర్షణను తీసుకొస్తాయి. ఎప్పటికీ వాడిపోని ఈ పూలను ప్రియమైన వారికి బహుమతులుగా ఇచ్చి మనసు దోచేయండి మరి!

Read More :
“World Tailors Day | దర్జాలేని దర్జీ బతుకులు.. రెడీమేడ్ బట్టలతో కుదేలవుతున్న టైలరింగ్ దుకాణాలు”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

