Papidi Hairstyles | ఒకప్పుడు జడ మధ్యలో ఉన్న పాపిట ట్రెండీ హెయిర్ స్టైల్‌గా మారిపోయిందిగా..
Papidi Hairstyles | జడ వేసుకునేప్పుడు పాపిట తీసుకుంటారు. అది కూడా మధ్యలోనో, పక్కకో తిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది. పాపిట తీసినా, జడ వేసినా చిత్రంగానే అనిపించాలి. ఆ జడలోనూ ఒక చిత్రం కనిపించాలి. అప్పుడే అది ‘ట్రెండీ హెయిర్‌స్టైల్' అవుతుంది.
Papidi Hairstyles | జడ వేసుకునేప్పుడు పాపిట తీసుకుంటారు. అది కూడా మధ్యలోనో, పక్కకో తిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది. పాపిట తీసినా, జడ వేసినా చిత్రంగానే అనిపించాలి. ఆ జడలోనూ ఒక చిత్రం కనిపించాలి. అప్పుడే అది ‘ట్రెండీ హెయిర్‌స్టైల్’ అవుతుంది. గుండె గుర్తు నుంచి గులాబీ పువ్వు దాకా రకరకాల బొమ్మలను ఆవిష్కరిస్తున్న కొత్త రకం జడలు..

డ్రెస్సు వేస్తేనో, జీన్సు తొడిగితేనో కాదు.. జడవేసినా, రబ్బరు బ్యాండు పెట్టినా కొత్తగానే ఉండాలనుకుంటారు ఈతరం ఆడపిల్లలు. ఇక, జడ సంగతైతే చెప్పనే అక్కర్లేదు. హైపోనీ, ఫ్రెంచ్ ప్లెయిట్, ఫిష్‌టెయిల్.. ఎన్నెన్నో సింగారాలు. మగువల కురుల ముస్తాబుకు సంబంధించి యూట్యూబ్‌లో రకరకాల ట్యుటోరియల్స్ పుట్టుకొచ్చాయి. ఇన్‌స్టాలో ఎన్నో పేజీలు వెలిశాయి. కొత్తకొత్త మోడళ్ల జడలు వేస్తూ నెట్ ప్రపంచంలో స్టార్ స్టేటస్‌ను పొందిన వాళ్లూ ఎందరో.

అమ్మాయి జడకు అంత క్రేజ్ ఉండబట్టే ఎప్పటికప్పుడు వినూత్నమైన రకాలు తెరమీదకి వస్తున్నాయి. అందులో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.. జడ మధ్యలో చిత్రం కనిపించడం. హార్ట్ బ్రెయిడ్, మిక్కీ బ్రెయిడ్, రోజ్ బ్రెయిడ్లాంటి పేర్లతో ఇవి మగువలను మురిపిస్తున్నాయి. జుట్టు మధ్యలో ఏదైనా బొమ్మ కనిపించాలంటే.. ఆ ఆకృతి ప్రకారం వెంట్రుకల్ని కత్తిరిస్తారు. కానీ ఇక్కడలా కాదు. జుట్టును పాయలుగా విడదీసి, చిన్న జడలల్లి, క్లిప్పులూ రబ్బర్ బ్యాండ్లను ఉపయోగిస్తూ వింతవింత బొమ్మలు వచ్చేలా చేస్తారు. అంటే మన జుట్టుకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండానే కొత్త హెయిర్ స్టైల్ ప్రయత్నించవచ్చు. ఆన్లైన్లో వీడియోలు చూస్తే జడలు వేయగల నైపుణ్యం ఉన్న ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఆఫీసులో ఫంక్షన్లకూ, కాలేజీ ఫెస్ట్లకూ వేసుకెళ్తే.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మనమే. ఈ విభిన్న హెయిర్ స్టైల్స్‌తో సిగ సింగారించుకోండి, తెగ వెలిగిపోండి!
Read More :
“snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty
- fashion
- hair style
- Hairstyle
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

