velvet fashion | డ్రెస్ అయినా, ప్యాంట్ అయినా… ట్రెండు మాత్రం వెల్వెట్దే!
velvet fashion | చలికాలం జోరుమీదుంది. హేమంత తుషారానికి శిశిర పవనం తోడైతే ఇక ఒళ్లంతా చలి ముండ్లు గుచ్చుకుంటాయి. దాన్నుంచి తప్పించుకోవాలంటే ఈ మూడు నెలలు వేడినిచ్చే ఆచ్ఛాదనను ఆశ్రయించక తప్పదు.
velvet fashion | చలికాలం జోరుమీదుంది. హేమంత తుషారానికి శిశిర పవనం తోడైతే ఇక ఒళ్లంతా చలి ముండ్లు గుచ్చుకుంటాయి. దాన్నుంచి తప్పించుకోవాలంటే ఈ మూడు నెలలు వేడినిచ్చే ఆచ్ఛాదనను ఆశ్రయించక తప్పదు. దానికోసం దేవదాసులో నాగేశ్వర్రావులా శాలువా కప్పుకొనో, కశ్మీరు కన్యకల్లా మందపాటి స్వెటర్లు వేసుకునో తిరగకుండా.. ఫ్యాషనబుల్‌గా కనిపిస్తూనే బయటికెళ్లే మార్గం ఒకటుంది. అదే వెచ్చవెచ్చటి వెల్వెట్ దుస్తులు ధరించడం. అమ్మాయిలకూ, అబ్బాయిలకూ అందాన్నిచ్చేలా రూపొందుతున్నాయివి.
వెల్వెట్… మెత్తని పువ్వును చూసిన అనుభూతిని కలిగించే వస్త్రం. అందమైన రంగులు, అందుకు తగ్గ మెరుపుతో కనిపించే ఈ వస్త్రశ్రేణి ఎప్పటినుంచో మనకు సుపరిచితమే. అయితే ఇటీవల సరికొత్త హంగులద్దుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త కాంతులీనుతున్నది. అమ్మాయిలకూ అబ్బాయిలకూ పనికొచ్చేలా రకరకాల దుస్తుల రూపాన్ని సంతరించుకుంటున్నది. మనం వేసుకునేది డ్రెస్ అయినా, ప్యాంట్ అయినా… ట్రెండు మాత్రం వెల్వెట్దే!
ఎన్నో రకాలు…
కొంతమందికి వెల్వెట్ అనగానే చిన్నపిల్లల గౌన్లు గుర్తొస్తాయి. మరి కొంతమందేమో దీన్ని ధరిస్తే లావుగా కనిపిస్తామని అనుకుంటారు. అబ్బెబ్బే… అదేం లేదు. వాటిని ఇప్పుడు కాలేజీ పిల్లల నుంచి ఆఫీసుకు వెళ్లే వాళ్ల దాకా ఎవరైనా వేసుకోవచ్చు.. అంటున్నారు ఫ్యాషనిస్టులు. అందుకే వెల్వెట్‌తో మిడి డ్రెస్‌లు, జీన్స్టాప్లు, సింగిల్పీస్లు, క్రాప్టాపుల్లాంటి మోడ్రన్ దుస్తులతోపాటు చీరలు, లంగావోణీలు, సల్వార్ కమీజుల్లాంటి భారతీయ వస్ర్తాలనూ రూపొందిస్తున్నారు. ఇక, మగవాళ్ల కోసం చొక్కాలు, టీ షర్టులు, బ్లేజర్లు, ప్యాంట్లను తీసుకువస్తున్నారు. మందంగా ఉండే ఇవి వెచ్చగా ఉండటమే కాదు మెత్తగా శరీరానికి హత్తుకుపోయి హాయినిస్తాయి కూడా. లేస్, శాటిన్, సిల్క్లాంటి వాటితో కలిపి కూడా వెల్వెట్ దుస్తుల్ని తయారుచేస్తున్నారు. ప్రింట్లు, ఎంబ్రాయిడరీతో కొత్త లుక్‌లో దొరుకుతున్నాయి. ఇంకేం, మీ మూడ్‌ని బట్టి, సందర్భాన్ని బట్టి నచ్చినవి ఎంచుకోండి. రాజసం ఉట్టిపడే దుస్తుల్లో మెరిసిపోండి.
Read More :
“Frocks | సంప్రదాయాన్ని ఇష్టపడేవారి కోసం సరికొత్త ఫ్రాక్స్”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- fashion
- saree
- velvet fashion
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

