Frocks | సంప్రదాయాన్ని ఇష్టపడేవారి కోసం సరికొత్త ఫ్రాక్స్
Silk Fabrics | పండుగల సీజన్లో సంప్రదాయాన్ని గుర్తుకుతెస్తూనే ట్రెండీగా కనిపించే దుస్తులదే హవా. అలాంటివాటిని ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రాక్స్ ఇవి. పట్టు ఫ్యాబ్రిక్‌తో నిండుగా కనిపిస్తాయి. సౌకర్యవంతంగానూ అనిపిస్తాయి.
Silk Fabrics | పండుగల సీజన్లో సంప్రదాయాన్ని గుర్తుకుతెస్తూనే ట్రెండీగా కనిపించే దుస్తులదే హవా. అలాంటివాటిని ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రాక్స్ ఇవి. పట్టు ఫ్యాబ్రిక్‌తో నిండుగా కనిపిస్తాయి. సౌకర్యవంతంగానూ అనిపిస్తాయి.
ఇక్కత్ సొగసు..
మల్టీషేడ్ పటోలా ఇక్కత్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. లావెండర్, పింక్, ఎల్లో, ఆరెంజ్ వంటి నిండైన రంగులతో తయారైన ఫ్యాబ్రిక్‌పై ఇక్కత్‌తో ఫ్లీట్స్, పెద్ద బార్డర్ జతచేశారు. బాటమ్‌కు కాంట్రాస్ట్‌గా.. చేతులకు పటోలా ఇక్కత్ కాంబినేషన్లో ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు. పింక్ కలర్ ప్లెయిన్ పట్టు ఫ్యాబ్రిక్‌తో బాడీపార్ట్ డిజైన్ చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. పండుగలకు చక్కని ఎంపిక.
‘రాయల్’ బ్లూ..
రాయల్ బ్లూ ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. నిండైన నీలిరంగుపై బంగారు వన్నె గీతలతో నిండుదనం వచ్చింది. కంచిపట్టు బార్డర్ సంప్రదాయ సౌందర్యాన్ని ప్రసాదించింది. పైభాగంలో బ్లూ కలర్ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ చేశారు. బాటమ్ పార్ట్‌కు కాంట్రాస్ట్‌గా.. హ్యాండ్స్‌కు కూడా కంచిపట్టు జతచేసి ప్రిల్స్ ఇచ్చారు. సాదా నీలం షిఫాన్ ఫ్యాబ్రిక్ పై బంగారు వన్నె బార్డర్ జత చేసిన దుపట్టా అదనపు ఆకర్షణ.
రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్,
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
స్టాకబుల్ జువెలరీ ఎందుకంత ఆకట్టుకుంటుంది? వీటి స్పెషాలిటీ ఏంటి?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

