స్టాకబుల్ జువెలరీ ఎందుకంత ఆకట్టుకుంటుంది? వీటి స్పెషాలిటీ ఏంటి?
Stackable Jewelry | ఫ్యాషనబుల్ ఆభరణాలను ధరించేవారిని అమితంగా ఆకర్షిస్తున్న లేటెస్ట్ సిరీస్.. ‘స్టాకబుల్ జువెలరీ’. నాలుగైదు వరుసల్లో హుందాగా అమరిపోయే ఈ నాజూకు నగలకు ఎన్నో ప్రత్యేకతలు.
Stackable Jewelry | అతివల అలంకరణలో అగ్రస్థానం ఆభరణాలదే. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కొందరు భారీ నగలు ధరించి నిండుగా మెరిసిపోవాలని కోరుకుంటారు, మరికొందరు తేలికపాటి ఆభరణాలతో హుందాగా కనిపించాలని అనుకుంటారు. ఫ్యాషనబుల్ ఆభరణాలను ధరించేవారిని అమితంగా ఆకర్షిస్తున్న లేటెస్ట్ సిరీస్.. ‘స్టాకబుల్ జువెలరీ’. నాలుగైదు వరుసల్లో హుందాగా అమరిపోయే ఈ నాజూకు నగలకు ఎన్నో ప్రత్యేకతలు.

సందర్భం ఏదైనా చక్కగా ముస్తాబు కావాలనే కోరుకుంటారు మహిళలు. అందులోనూ సంప్రదాయంతోపాటు ఆధునిక హంగులున్న దుస్తులను ఇష్టపడతారు. వాటికి నప్పేలా నగలను ఎంచుకుంటారు. అలాంటివారికోసం వచ్చినవే.. స్టాకబుల్ ఆభరణాలు. ఈ నగలు బంగారం, వెండి, ప్లాటినమ్తోపాటు చవకైన లోహాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.
అయితే మిగతా వాటికంటే ఇవి కాస్త భిన్నంగా కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా కాకుండా నాలుగైదు వరుసల్లో ధరిస్తారు.

ఒకే డిజైన్లో వేరువేరు కొలతలున్న గొలుసుల్ని ధరిస్తే.. ఆ ఆకర్షణే వేరు. నెలవంక, నక్షత్రాలు, చిట్టిచిట్టి పూలు, వాన చినుకులను పోలిన చిన్నచిన్న లాకెట్లను వీటికి జతచేస్తారు.
చేతికి నాలుగైదు వరుసల్లో సన్నటి గొలుసుల్ని బ్రేస్లెట్లుగా అలంకరించుకుంటారు. ఒకే వేలికి నాలుగైదు వరుసల్లో వింతవింత ఉంగరాలూ ధరిస్తారు. చెవులకు కూడా నాలుగైదు జతలుగా ముస్తాబుచేసుకునే ఆభరణాలూ అందుబాటులో ఉన్నాయి.

ఒకే లోహంతో చేసిన గొలుసుల్ని లేదా వేరువేరు లోహాలతో చేసిన గొలుసుల్ని కలగలిపి వరుసలుగా అలంకరించుకోవచ్చు.
పసిమి ఛాయతో మెరిసే బంగారం మధ్యలో వెండి, ప్లాటినం మరింతగా ధగధగలాడతాయి. టెర్రకోట, త్రెడ్, సిల్క్, ఫ్యాబ్రిక్ ఆభరణాలకూ స్టాకబుల్ సొబగులద్దుతున్నారు డిజైనర్లు.

Read More :
“లెదర్తో తయారు చేసిన బ్యాగులు, బెల్టులు మాత్రమే కాదు.. జువెల్లరీ కూడా ఫేమస్సే !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

