Fabric Jewellery |దుస్తులతో తయారు చేసిన ఆభరణాలు.. అతివలను ఆకట్టుకుంటున్న సరికొత్త మోడల్స్
Fabric Jewellery | ఫ్యాబ్రిక్ జువెలరీ... దుస్తులకు మాత్రమే పరిమితమైన వస్ర్తాన్ని నగలకూ విస్తరించింది. ట్రెండీగా కనిపించడమే కాదు, మ్యాచింగ్లోనూ ‘భళా!’ అనిపించడం దీని ప్రత్యేకత.
Fabric Jewellery | స్వర్ణాభరణాలే కాదు.. సుందర వర్ణాలలో రూపొందించిన సాదా నగలూ ఇప్పుడు మార్కెట్‌ను ఏలేస్తున్నాయి. ఆభరణానికి లోహమే ఆధారం కానక్కర్లేదు. అంతే అందంగా వస్త్రంతోనూ తీర్చిదిద్దవచ్చు. ఫ్యాబ్రిక్ జువెలరీ… దుస్తులకు మాత్రమే పరిమితమైన వస్ర్తాన్ని నగలకూ విస్తరించింది. ట్రెండీగా కనిపించడమే కాదు, మ్యాచింగ్లోనూ ‘భళా!’ అనిపించడం దీని ప్రత్యేకత.

నగల నిర్వచనం మారుతున్నది. నాజూకుగా ఉండాలన్న నిబంధన లేదు. పసిడి రంగులోనే మెరవాలన్న పట్టింపూ ఉండటం లేదు. ఫ్యాషన్‌గా కనిపించడమే పరమావధి. కాబట్టే దారంతో చేసిన నగలు, మట్టితో చేసిన ఆభరణాలు ముచ్చటగా మార్కెట్లో కొలువుదీరుతున్నాయి. అంతకుమించి, మ్యాచింగ్కు మకుటం పెట్టేలా వస్త్రంతో రూపొందుతున్న జువెలరీ కూడా నగల రాజ్యాన్ని ఏలేస్తున్నాయి.

ఎన్నో రకాలు..
వస్త్రంతో తయారయ్యే ఈ జువెలరీలో చెవిపోగులు, నెక్లెస్‌లు, చోకర్లు, హారాలతోపాటు చేతిగాజుల్లాంటివీ వస్తున్నాయి. దుస్తుల్లో ఉన్నట్టే.. ఇక్కత్, కలంకారి, మధుబని ప్రింట్.. ఇలా రకరకాల వస్ర్తాలతో చేసినవి కూడా దొరుకుతున్నాయి. మనం ఏ డ్రెస్, చీర మీదికి మ్యాచ్ చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ రకం వాటిని, దాదాపు అదే డిజైన్‌లో, అదే రంగులో ఎంపిక చేసుకోవచ్చు. నగల మీద హ్యాండ్ పెయింట్ వేసినవాటికి కూడా మార్కెట్లో ఆదరణ ఉంది. ఆర్టిస్టిక్ నగలను ఇష్టపడే వారికి ఇవి మంచి ఎంపిక. మధుబని పెయింట్ వేసినవీ నగల్లో విభిన్నంగా కనిపించేవే. ఇక చెవిపోగుల్లో అయితే బుట్టలూ, దుద్దులూ, చాంద్ బాలీలూ.. ఇలా రకరకాలవి తయారవుతున్నాయి. అద్దాలు, పూసలు, మువ్వలు జోడించిన ఫ్యాబ్రిక్ నగలూ ముస్తాబవుతున్నాయి. కాబట్టి అమ్మాయిలూ! ఈసారి కొత్త నగలు కొనేప్పుడు ఓ వాలుచూపు వీటిమీదా విసరండి.
Read More :
“snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

