– కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్
రుద్రంపూర్, జులై 11 : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణం పెంపొందేలా, జవాబుదారితనాన్ని కచ్చితంగా పాటించేలా తయారు చేయాలని కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. శనివారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి ‘విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల అప్పగింత’ (ఇన్వెస్టిచర్ సెర్మనీ)పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఎస్ఐ రాజశేఖర్ ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అంకితభావం, చిత్తశుద్ధితో పాటు నాయకత్వ విలువలను పెంపొందంచుకునేందుకు కృషి చేయాలన్నారు.
ప్రపంచానికి నైతికత, దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమని, నిరంతర అభ్యసనంతో నైపుణ్యాలను పెంపొందించుకుని నాయకత్వ లక్షణాలను మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా స్కూల్ పీపుల్ లీడర్ (విద్యార్థి, విద్యార్థిని) క్లబ్ జనరల్ సెక్రెటరీ అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు (గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ) గ్రూపుల కెప్టెన్లను ఎన్నుకుని వారి చేత ముఖ్య అతిథి ప్రమాణస్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జయబాలన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.