Shubman Gill : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీకి క్రికెట్ కళొచ్చింది. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ గ్యాలరీలో సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) తళుక్కుమన్నారు. రాయల్ బాక్స్‌లో రాయల్ లుక్‌తో గిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. సతీమణి అంజలి సమేతంగా సచిన్ హాజరయ్యాడు. విరామంలో వీరితో టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్(Roger Federer) కలవడంతో కెమెరా కళ్లన్నీ వీరివైపే తిరిగాయి.
వన్డే సిరీస్‌కు ముందే ఇంగ్లండ్ చేరుకున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బిజీగా గడుపుతున్నాడు. పాప్ సింగర్లను కలిసి.. మెర్సిడెజ్ బెంజ్ గ్యారేజ్‌లో ఫార్ములా వన్ రేసర్ ఆంటినెల్లాతో కలిసి కారిడార్ క్రికెట్ ఆడిన గిల్ ఈసారి వింబుల్డన్‌లో మెరిశాడు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా మ్యాచ్ చూసేందుకు రాగా.. రాయల్ బాక్స్‌లో వారి పక్కనే కూర్చున్నాడు టీమిండియా కెప్టెన్. మ్యాచ్ చూసేందుకు వచ్చిన వెస్టిండీస్ వెటరన్ బ్రియాన్ లారా, టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌తో కాసేపు ముచ్చటించాడు గిల్. జకోవిచ్, సినర్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వీక్షించారు వీరంతా.
Sachin Tendulkar 🤝 Virat Kohli 🤝 Shubman Gill
Three generations of Indian cricketing royalty in one image 📸#Wimbledon pic.twitter.com/xvIxO3xc8w
— Wimbledon (@Wimbledon) July 10, 2026
అనంతరం మీడియాతో మాట్లాడిన గిల్.. ‘క్రికెట్ బదులు ఏ ఆటను ఎంచుకుంటారు?’ అనే ప్రశ్నకు ‘టెన్నిస్’ అని బదులిచ్చాడు. అయితే.. తనకు డబుల్స్ భాగస్వామిగా కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ఉండాలని అతడు చెప్పాడు. అల్కరాస్ ఆటను ఎంతో ఆస్వాదిస్తాడని చెప్పిన భారత సారథి.. అతడితో ఆడడం ఎంతో సరదగా ఉంటుందని అన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జూలై 14 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలవ్వనుంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పొట్టి సిరీస్ కోల్పోయిన టీమిండియాకు వన్డే సిరీస్ విజయం కట్టబెట్టాలని గిల్ పట్టుదలతో ఉన్నాడు.
Serving style as effortlessly as he serves runs 😎
Shubman Gill made an elegant appearance while attending Wimbledon as a guest in the prestigious Royal Box, becoming just the fourth Indian cricket captain to receive this honour✨
Watch #Wimbledon 2026 Final | SAT, 11 JULY,… pic.twitter.com/uayGEAd9WU
— Star Sports (@StarSportsIndia) July 11, 2026