అమరావతి : రాజకీయ సంస్కారం లేని నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ ( Chandrababu ) ని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ( Perni Nani ) వ్యాఖ్యనించారు. రాజకీయ అనుభవం, పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్( YS Jagan ) పై తప్పుడు కూతలు కూస్తు సమాజానికి ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ఆరుగురిని హత్య చేసిన ఓ సైకోకు వైఎస్ జగన్ పోలికలున్నాయని విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు వయస్సుకు తగ్గట్టు మాట్లాడడం లేదని విమర్శించారు. సోషల్ మీడియాలో 80శాతం టీడీపీకి చెందినవేనని స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియా దిగజారిపోవడానికి కారకుడు చంద్రబాబే కారణమని విమర్శించారు.
వైఎస్ జగన్ సతీమణిపై నీచ, విష ప్రచారం చేశారని వెల్లడించారు. వైసీపీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. సోషల్ మీడియా కోసం ప్రభుత్వం రూ.206 కోట్లు జనం డబ్బును ఖర్చుచేసిందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్న మీడియా, సోషల్ మీడియాలపై చర్యలు తీసుకుంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని పేర్నినాని దుయ్యబట్టారు.