హైదరాబాద్, జనవరి 23: లారస్ ల్యాబ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.252 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.92 కోట్ల లాభంతో పోలిస్తే 174 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,415 కోట్ల నుంచి రూ.1,778 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ..జనరిక్ ఔషధాలకు డిమాండ్ నెలకొనడం వల్లనే లాభాల్లో రెండింతల వృద్ధి నమోదైందన్నారు.