– మార్చి 4లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలి
– సీవోఈ డా.ఉపేందర్‌రెడ్డి
రామగిరి, ఫిబ్రవరి 11 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఇయర్ వైజ్ 2011- 12 బ్యాచ్ నుండి 2015-16 బ్యాచ్ వరకు ఉన్న విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి మార్చి 4వ తేదీ వరకు అవకాశం ఉందని, ఇదే చివరి అవకాశమని ఎంజీయూ సీఈవో డా. జి.ఉపేందర్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. అయితే ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 4 లోగా, రూ.100 ఆపరాద రుసుంతో మార్చి 6 లోగా ఫీజులు చెల్లింవచ్చవచ్చన్నారు. పరీక్ష ఫీజులను ఆయా కళాశాలల్లో చెల్లించాలన్నారు. అయితే ఆయా బ్యాచ్ లో బ్యాక్లాగ్ పరీక్షలకు హాజరు కావడానికి ఇదే చివరి అవకాశామని తదుపరి ఎలాంటి అవకాశం ఉండదని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www.mguniversity.ac.in లో గాని కళాశాలల్లో గాని సంప్రదించాలన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసులు చేయవద్దని పేర్కొన్నారు.
– రెండు సబ్జెక్టుల లోపు బ్యాక్ లాగ్ పరీక్షకు బీఏ విద్యార్థులు రూ.625, బీకాం, బీఎస్సీ విద్యార్థులు రూ.675 చెల్లించాలన్నారు
– మూడు సబ్జెక్టులు, ఆ పైబడిన పేపర్లకు బీఏ విద్యార్థులు రూ.950, బీకాం, బీఎస్సీ విద్యార్థులు రూ.1,015 చెల్లించాలన్నారు.