కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షటర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా.. యంగ్ ప్లేయర్లు మాళవిక బన్సోద్, అష్మిత చాలిహా రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగినలక్ష్యసేన్ బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 17-21, 11-21తో ఇండోనేషియా షట్లర్ జాకీ ఉబైదిల్లా చేతిలో వరుస గేమ్స్‌లో చిత్తయ్యాడు. హెచ్ఎస్ ప్రణయ్ 17-21, 22-20, 22-24 తేడాతో కోడై నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ మన్నేపల్లి తరుణ్ 21-17 14-21 8-21 తో వాంగ్ పో వీ (తైపీ) చేతిలో ఓడగా.. కిరణ్ జార్జ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అయితే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక 21-17, 16-21, 21-9 తేడాతో ప్రపంచ 52వ ర్యాంకర్ వైవోన్ లీ (జర్మనీ)పై గెలిచి శుభారంభం చేసింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత 21-16, 21-13తో తలితా రామధాని (ఇండోనేషియా)ని చిత్తు చేసింది. అన్మోల్ ఖర్బ్తో పాటు డబుల్స్‌లో రుతపర్ణ-శ్వేతపర్ణ ద్వయం, మిక్స్‌డ్‌లో ఆశిత్ సూర్య-అమృత జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి.