న్యూఢిల్లీ, మే 20: కీలక రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఏప్రిల్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.7 శాతంగా నమోదయ్యాయి. స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే కీలక రంగాలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఒక్క శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకున్నది. బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు మాత్రం ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోగా..స్టీల్ 6.2 శాతం, సిమెంట్ 9.4 శాతం, విద్యుత్ 4.1 శాతం చొప్పున సాధించాయి.