అర్హులైన స్థానికులకే డబుల్ ఇండ్లు
అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థానికేతరులకు కేటాయిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులైన పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు.
- స్థానికేతరులకు కేటాయించడంపై అభ్యంతరం
సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థానికేతరులకు కేటాయిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులైన పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు లేఖను రాయగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, లబ్ధిదారులు జాయింట్ కలెక్టర్ జితేందర్‌రెడ్డి, పీడీ అశోక్‌ల దృష్టికి తెచ్చారు.
అర్హులైన వారి దరఖాస్తులు అధికారుల వద్దే పెండింగ్‌లో ఉండగా, స్థానికేతరులకు ఎలా కేటాయిస్తారని లబ్ధిదారులు అధికారులను ఈ సందర్భంగా ప్రశ్నించారు.తమకు ఇండ్లు కేటాయించకపోవడంతో సంవత్సరాల తరబడి అద్దె ఇండ్లలో ఉంటూ.. ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతరులకు ఇండ్లను కేటాయిస్తే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నాయకులు అధికారులకు వివరించారు. స్థానికేతరులకు కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుర్మ హేమలత, నాయకులు వెంకటేశ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Saicharan Colony Adikmet
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

