KTR | హైదరాబాద్ సరూర్నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. ఈ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో నాయకులు స్వాగతం పలకగా, సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడ్డారు.
కేటీఆర్ రాకతో మలక్పేట పరిసరాలు గులాబీమయంగా మారాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సరూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభా ప్రాంగణం వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://t.co/bcg3alWpuj pic.twitter.com/BEFuhscrIG
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026