హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుటుంబసమేతంగా శుక్రవారం మలేషియాకు చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి సాదరస్వాగతం పలికారు. కేటీఆర్‌కు స్వాగతం పలికినవారిలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి తదితరులు ఉన్నారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖ సంయుక్తంగా శనివారం నిర్వహించనున్న తెలంగాణ 12వ ఆవిర్భావ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశామని మైటా, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు తెలిపారు. వేదికను అందంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కళారూపాలు ప్రదర్శిస్తామని వెల్లడించారు.