దేశంలో ఇది నయా ఎమర్జెన్సీ.. ప్రశ్నించే యువతను నిర్బంధించడం తగదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో అసమ్మతి, విమర్శలే కీలక పునాదులని, ప్రశ్నించే యువతను నిర్బంధించడం తగదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
- జంతర్‌మంతర్ వద్ద అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద త్రివర్ణ పతాకం ప్రదర్శించిన సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా నిప్పులు చెరిగారు.
దేశ భవిష్యత్తు కోసం నిజాయితీగా పోరాడుతున్న యువత, జెన్-జీ గొంతు నొకే ప్రయత్నం అభద్రతా భావానికి నిదర్శనమని మండిపడ్డారు. వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు శాంతియుతంగా గళమెత్తిన యువతపై అతిక్రమణ(ట్రెస్పాసింగ్) కేసులు బనాయించడం సమర్థనీయం కాదని కేటీఆర్ పేరొన్నారు. ఇది దేశంలో ‘నయా ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితులను తలపిస్తున్నదని విమర్శించారు. నిరసనలు, ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్న సత్యాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కేటీఆర్ హితవు పలికారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

