‘ఎస్సారెస్పీ’ విడుదలలో వివక్ష ఎందుకు?
‘ఎస్సారెస్పీ నుంచి విడుదల చేసిన సాగునీటిని ఆయకట్టు పరిధిలో ఉన్న కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గ రైతులకు ఇవ్వరా? ఇక్కడి రైతులు చేసిన తప్పేంటి? ఎందుకీ వివక్ష?’ అంటూ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- కరీంనగర్, చొప్పదండికి నీళ్లు ఇవ్వరా?: ఎమ్మెల్యే గంగుల
- రైతులతో కలిసి ఆందోళన
- అధికారులతో చర్చలు జరుపుతూనే గేట్లు ఎత్తి నీటి విడుదల
చొప్పదండి, అక్టోబర్ 14 : ‘ఎస్సారెస్పీ నుంచి విడుదల చేసిన సాగునీటిని ఆయకట్టు పరిధిలో ఉన్న కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గ రైతులకు ఇవ్వరా? ఇక్కడి రైతులు చేసిన తప్పేంటి? ఎందుకీ వివక్ష?’ అంటూ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెగ్యులేటరీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయకపోతే కెనాల్ బ్రిడ్జిపై నుంచి దూకుతానని అధికారులను హెచ్చరించారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో పంటలు ఎండిపోతున్నా సాగునీటిని ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ బుధవారం చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రైతులతో కలిసి గంగుల నిరసనకు దిగారు.
ట్రాక్టర్లో రైతులను ఎక్కించుకొని స్వయంగా నడుపుకొంటూ చొప్పదండి పట్టణంలోని శివకేశవ ఆలయం సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. గంగుల పోలీస్, ఎస్సారెస్పీ అధికారులతో చర్చలు జరుపుతూనే రైతులతో కలిసి రెగ్యులేటరీ గేట్ల వద్దకు వెళ్లారు. ఓ వైపు రెగ్యులేటరీ గేట్లు ఎత్తుతూనే.. అధికారులతో చర్చలు జరిపి కాకతీయ కెనాల్లో దిగువకు 300 క్యూసెకుల నీటిని విడుదల చేశారు. రైతులందరికీ సమానంగా సాగునీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు అధికారులపై ఉన్నదని గంగుల సూచించారు. నీటి విడుదల నిలిపివేస్తే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

