KTR : సీఎం రేవంత్ రెడ్డితో సహా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టేందుకు ఒకరోజు ప్రత్యేకంగా సభ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. మిగిలిన రోజుల్లో ప్రజా సమస్యలు, అమలుకాని హామీలపై చర్చిద్దామని ఎద్దేవా చేశారు. ఎర్రవల్లికి వెళ్తున్న తనను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పోలీస్‌స్టేషన్ దగ్గరే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలోని లోపాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుండటంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు కుట్రలకు తెరలేపింది. సోమవారం బీఆర్ఎస్ మహిళ ఎమ్మేలపై అవమానకర రీతిలో దాడులు చేయించింది.
తిరిగి బీఆర్ఎస్ నేతలపైనే అక్రమంగా కేసులు పెట్టించింది. పైగా ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంటే మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి పంపించింది. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ అగ్రనేతలను అడ్డుకుని బోయనపల్లి పోలస్స్టేషన్కు తరలించింది. ఈ క్రమంలో బోయినపల్లి పోలీస్‌స్టేషన్ దగ్గర కాంగ్రెస్ సర్కారు తీరుపై కేటీఆర్ విమర్శలు గుప్పంచారు.