KTR | పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వేధించాలని ప్రభుత్వం చూస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ రోజు చోటుచేసుకున్న పరిణామాలపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి కక్షపూరిత చర్యలకు మేము భయపడేది లేదన్నారు. ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్టులు, కేసులు పెడుతోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజా గొంతుకగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రేవంత్ రెడ్డికి దళితులపై నిజంగానే ప్రేమ ఉంటే.. దళిత గిరిజన డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ను చంపాలని, ఆయన చావాలని కోరుకుంటూ కాంగ్రెస్ గూండాలను రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ చావును కోరుకుంటున్న రేవంత్ రెడ్డి.. నీ దిక్కుమాలిన రాజకీయాలను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తోందని..రేవంత్ రెడ్డికి ఏ సమయంలో ఎట్లా వాత పెట్టాలో తెలంగాణ సమాజానికి తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి దళితులపై నిజంగానే ప్రేమ ఉంటే.. దళిత గిరిజన డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించు.
తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ను చంపాలని, ఆయన చావాలని కోరుకుంటూ కాంగ్రెస్ గూండాలను రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడు.
కేసీఆర్ చావును కోరుకుంటున్న రేవంత్ రెడ్డి.. నీ… pic.twitter.com/rMxbpTsSav
— BRS Party (@BRSparty) September 8, 2026