మేడ్చల్, సెప్టెంబర్8(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఠాణాల్లో నిర్బంధించారు. దీంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రక్షణకు వెళ్తున్న హరీశ్‌రావు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, బండారి లక్ష్మారెడ్డి, సంజ య్, మాణిక్‌రావును బొల్లారం సమీపంలో మల్కాజిగిరి సీపీ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు.
వారిలో హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, వివేకానంద, లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాణిక్‌రావును జవహర్‌నగర్ ఠాణాకు తరలించారు. సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు వేలాది సంఖ్యలో జవహర్‌నగర్‌కు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి మద్దతుగా నిలిచారు. కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్తున్న కాంగ్రెస్ గుండాలకు ఎస్కార్ట్ ఇచ్చి పంపుతారా? అంటూ హరీశ్‌రావు పోలీసులపై ఫైరయ్యారు.