షాద్‌నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు గర్హనీయం.. వ్యాఖ్యలపై విచారణ జరుపాలి
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు కోరుకుంటున్నామంటూ కాంగ్రెస్ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ఆయనపై కచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- కేసీఆర్‌పై వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ డిమాండ్
- బంజారాహిల్స్రాణాలో ఫిర్యాదు
- వివిధ ఠాణాల్లోనూ ఫిర్యాదులు
బంజారాహిల్స్, సెప్టెంబర్ 8/నమస్తే తెలంగాణ, నెట్వర్క్: ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు కోరుకుంటున్నామంటూ కాంగ్రెస్ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ఆయనపై కచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శంకర్‌పై మంగళవారం ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ఠాణాల్లో ఎమ్మెల్యే శంకర్‌పై పలువురు ఫిర్యాదులు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని పేర్కొన్నారు. కేసీఆర్ చావును కోరుకుంటున్నామని, అందుకే వెయ్యి డప్పులు కొట్టిస్తున్నామన్న ఆయన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని మండిపడ్డారు.

ఎమ్మెల్యే శంకర్‌తోపాటు గతంలో పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఇదే తరహాలో మాట్లాడారని వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలున్నాయని, అతడిపై బీఎన్ఎస్ 196, 351(3), 352,353, 61 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ నేతల పాత్రపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. షా ద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ న గర పరిధిలోని గాంధీనగర్, వారాసిగూడ, చిలకలగూడ, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

