ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి?
హైదరాబాద్‌లో నిర్మాణ రంగాన్ని పట్టిపీడిస్తున్న రాహుల్, రేవంత్ (ఆర్ఆర్) ట్యాక్స్ వాస్తవమేనని, నగరంలోని ఏ బిల్డర్, డెవలపర్‌ను అడిగినా ఈ విషయం స్పష్టం చేస్తారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరొన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో నిర్మాణంలో ఉన్న భవనాల యజమానుల నుంచి చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనేది వాస్తవమని స్పష్టంచేశారు.
- మోదీ, అమిత్ షా మాటలే తప్ప చేతలు శూన్యం
- చోటేభాయ్పై చర్యలకు బడేభాయ్కి ధైర్యం లేదు
- హైదరాబాద్‌లో ఎస్ఎఫ్టీకి 200 వసూలు నిజం
- బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో నిర్మాణ రంగాన్ని పట్టిపీడిస్తున్న రాహుల్, రేవంత్ (ఆర్ఆర్) ట్యాక్స్ వాస్తవమేనని, నగరంలోని ఏ బిల్డర్, డెవలపర్‌ను అడిగినా ఈ విషయం స్పష్టం చేస్తారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరొన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో నిర్మాణంలో ఉన్న భవనాల యజమానుల నుంచి చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనేది వాస్తవమని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గురువారం ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఇంతటి తీవ్రమైన అవినీతి జరుగుతున్నదని స్వయంగా ఆరోపిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ పెద్దపెద్ద మాటలు చెప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప, ఆ ఆరోపణలపై విచారణ జరిపించడం కానీ, బాధ్యులపై చర్యలు తీసుకోవడం కానీ ఎందుకు లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డిని తన ఏబీవీపీ రోజుల నాటి చోటేభాయ్గా అభివర్ణిస్తూ, బడే భాయ్ మోదీ ఆయనపై ఎప్పటికీ చర్యలు తీసుకోరని ఎద్దేవాచేశారు.
బీజేపీ నేతల విమర్శలు కేవలం రాజకీయ ప్రచారానికే పరిమితమవుతున్నాయని, మాటల్లో అవినీతిని ప్రశ్నిస్తున్నా చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న అంతర్గత అవగాహనే ఈ వ్యవహారంపై చర్యలు లేకపోవడానికి కారణమని ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో జరుగుతున్న వసూళ్లపై మోదీ, అమిత్ షా వైఖరి ఇదేనా? అని ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

