వాహన బదిలీ.. ఆగాలండి!
వాహన యాజమాన్య బదిలీ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
- ఖైరతాబాద్ ఆర్టీఏలో వారం రోజులుగా జారీకాని సీసీలు
సిటీబ్యూరో, నవంబర్ 5 ( నమస్తే తెలంగాణ ) : వాహన యాజమాన్య బదిలీ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వారం రోజులుగా సీసీలు జారీ చేయడం నిలిపివేశారు. ఇటీవల వాహన బదిలీ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయడంలో భాగంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. దీంతో ఇక్కడ టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతున్నది.
ఈ కారణంగా ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలోని వాహనదారులు తమ వాహన బదిలీ ప్రక్రియకు కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవు. దీంతో వాహన బదిలీ కోసం స్లాట్ కూడా బుక్ కాకుండా అధికారులు మార్పులు తీసుకొచ్చారు. సాధారణంగా వాహనాన్ని మరొక వ్యక్తికి బదిలీ చేయాలంటే స్లాట్ బుక్ చేసుకొని సంబంధిత వాహన యజమాని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ఫొటో, సంతకం చేసి సరైన డాక్యుమెంట్స్ అప్పగించాల్సి ఉంటుంది.
అదే రోజు సీసీ జారీ అవుతుంది. ఆ సీసీని వాహనం కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తికి అందిస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి ఎక్కడైతే అడ్రస్ కలిగి ఉంటారో ఆ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ప్రక్రియ పూర్తి చేస్తే యాజమాన్య హక్కులు మారిపోతాయి. అయితే ఈ ప్రక్రియలో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్టీఏ అధికారులు ఆన్లైన్ చేశారు.
వాహన్-సారథి పోర్టల్‌లో ఈ ప్రక్రియ సులువుగా జరిగిపోయేలా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఖైరతాబాద్ పైలెట్ ప్రాజెక్ట్‌గా అధ్యయనం చేస్తున్నారు. కాగా, నగరంలోని మిగత ఆర్టీఏ కార్యాలయాల్లో సీసీలు జారీ అవుతాయి. పైలెట్ ప్రాజెక్ట్ ముగిశాక ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కార్యాలయాల్లో సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- CCS
- Khairatabad
- pilot project
- RTA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

