తీవ్ర సంక్షోభంలో పౌల్ట్రీ పరిశ్రమ
రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఎల్ నినో పరిస్థితుల తో జనవరి నాటికి మరింత దుర్భరంగా మారే ప్రమాదమున్నదని పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
- మక్కజొన్న, సోయా, జొన్నలను చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేయాలి
- హైదరాబాద్‌లో 24న పౌల్ట్రీ ఎక్స్పో
- పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఎల్ నినో పరిస్థితుల తో జనవరి నాటికి మరింత దుర్భరంగా మారే ప్రమాదమున్నదని పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మక్కజొన్న, సోయా ధరలు పెరుగుతుండటంతో రైతులకు పౌల్ట్రీ నిర్వహణ భారంగా మారుతున్నదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఐపీఈఎంఏ-పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బాయస్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది.
ఈ నెల 24 నుంచి 27వ వరకు హైదరాబాద్ వేదికగా జరిగే 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120 దేశాల నుంచి 51వేల మందికి పైగా పౌల్ట్రీ రంగ వ్యాపారవేత్తలు పాల్గొంటారు. 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ వీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బ్యాంకులు రుణాలను రీషెడ్యూల్ చేయాలని సూచించారు. పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రెడ్డి కోరారు.
రాష్ట్ర అవసరాల కంటే అదనంగా కోడిగుడ్లు, చికెన్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ.. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 5 లక్షల టన్నుల మక్కజొన్నలు గోదాముల్లో ఉన్నాయని, వాటిని ఇథనాల్ కంపెనీలకు కాకుండా పౌల్ట్రీ రైతులకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతిరెడ్డి, చక్రధర్, కేజీ ఆనంద్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

