Bus Catches Fire | కేరళలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. టూరిస్ట్‌లతో వెళ్తున్న కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు (KSRTC bus)లో మంటలు చెలరేగాయి (Bus Catches Fire). అయితే, అదృష్టవశాత్తూ అందులోని ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కొట్టాయం (Kottayam)లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మలప్పురం డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు (KL 15 A 208) 28 మంది ప్రయాణికులతో పతనంతిట్టలోని గవికి వెళ్తోంది. బస్సు రన్ని మీదుగా గవికి వెళ్తుండగా.. మణిమల (Manimala) సమీపంలోని పజాయిడం (Pazhayidam)లో గల కున్నతుపుళ ప్రాంతానికి రాగానే బస్సు ప్రమాదానికి గురైంది. ముందుగా వెనుకసైడు లెఫ్ట్ టైర్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. డ్రైవర్ బస్సును ఆపడంతో అంతా కిందకు దిగారు. ప్రయాణికుల లగేజ్‌ను కూడా తొలగించారు. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నారు.
సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కేఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేసింది. వారంతా కేఎస్ఆర్టీసీ బస్సులో బడ్జెట్ ట్రిప్‌కు వెళ్తున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read..
Contaminated Water | కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మృతి.. 100 మంది పరిస్థితి విషమం
New Year 2026 | న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలా అంటే?
New year 2026 | న్యూ ఇయర్ వేడుకలు ఏ దేశంలో ముందు జరుగుతాయో తెలుసా..?