Simhachalam | ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో అపచారం జరిగింది. పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు కనిపించాయి. ఈ నెల 29వ తేదీన సింహాచలంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం తాము కొనుగోలు చేసి పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు కనిపించాయని దంపతులు ఓ వీడియోలో తెలిపారు. ముందుగా దీనిపై దేవస్థానం సిబ్బందికి ఫిర్యాదు చేశామని, వారు సరిగ్గా పట్టించుకోకపోవడంతో వీడియోను సోషల్‌మీడియాలో పెడుతున్నామని అందులో పేర్కొన్నారు.
దంపతులు పోస్టు చేసిన వీడియో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదం తయారీ విషయంలో అజాగ్రత్తగా ఉండటం దారుణమని మండిపడ్డారు. హిందూ దేవాలయాలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని.. దీంతో ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయని వైసీపీ విమర్శించింది. ఆలయాల ప్రక్షాళన అంటే ఇదేనా అని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించింది. కాగా, నత్త విషయాన్ని భక్తులు తమ దృష్టికి తీసుకురాలేదని ప్రసాదాల విభాగం ఏఈవో రమణమూర్తి తెలిపారు. సోషల్‌మీడియాలో డైరెక్ట్‌గా వీడియో పోస్టు చేశారని, ప్రసాదాల విక్రయశాల సిబ్బంది ద్వారా తమకు విషయం తెలిసిందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఆ విషయాన్ని బయటపెట్టిన భక్తులపైనే దేవస్థాన అధికారులు కక్ష సాధింపుకు దిగారు. పులిహోర ప్రసాదంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని సింహాచల ఆలయ అధికారులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భక్తులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసిన భక్తులపై బీఎన్ఎస్ 298, 353(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సింహాచలం ఆలయంలోని ప్రసాదంలో నత్త
హిందూ దేవాలయాల్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం. దాంతో ఆలయాల్లో వరుసగా అపచారాలు, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదాల్లో కీటకాల అవశేషాలు
ఇదేనా @ncbn ఆలయాల ప్రక్షాళన అంటే?#SaveDevoteesFromTDP#APisNotinSafeHands… pic.twitter.com/1Hm7YhOK7O
— YSR Congress Party (@YSRCParty) December 30, 2025