కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 21వ బోర్డు సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ సోమవారం సమాచారం అందించారు.
- ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
హైదరాబాద్, అక్టోబర్26 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 21వ బోర్డు సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ సోమవారం సమాచారం అందించారు. వాస్తవంగా పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఈనెల 1న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తరువాత 26 తేదీకి వాయిదా వేశారు.
అయితే మహారాష్ట్ర పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి వెంట రాష్ట్ర ఇంజినీర్లు సైతం వెళ్లనున్న నేపథ్యంలో సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని బోర్డును తెలంగాణ కోరడంతో మంగళవారానికి వాయిదా వేసింది. తాజాగా సమావేశాన్ని మరోసారి వాయిదా వేసినట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. కాగా, నవంబర్ 5 ఉదయం 11గంటలకు చైర్మన్ నేతృత్వంలో సమావేశం కొనసాగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

