రైతులకే డిక్లరేషన్ ఎందుకు?
పంటలు సాగు చేయడం నేరమా.. మేమేమైనా పక్క దేశంలో పండిస్తున్నమా.. మెట్పల్లి ఎంపీడీవోను నిలదీసిన రైతు.
మెట్పల్లి రూరల్, అక్టోబర్ 26 : ‘రైతులు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అన్నం పెట్టే రైతు పంటలు పండించడం తప్పా? కరెంట్ వృథా చేస్తున్న వారికి కరువు లేదా? వారి నుంచి ఎందుకు డిక్లరేషన్ తీసుకోరు?’ అని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన రైతు మారు మురళీధర్‌రెడ్డి.. ఎంపీడీవో మహేందర్‌రెడ్డిని నిలదీశాడు. సోమవారం మెట్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాన్ని అందజేసి తన ఆవేదన వ్యక్తంచేశాడు.
ప్రభుత్వం రైతులపై కక్షగట్టి అన్నింటా సీలింగ్ పెడుతున్నదని వాపోయాడు. తాము ఏమైనా పక్కదేశంలో పంటలు పండిస్తున్నామా? అని ప్రశ్నించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి రైతులపై కక్షగట్టి ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డాడు. రైతు ప్రభుత్వమని, ప్రజాపాలన అని చెప్పడమే కానీ, రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు.
ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా రైతురుణ మాఫీ చేసి, ఎకరానికి రూ.50 వేల చొప్పున ఇచ్చి, అన్ని పంటలకు బోనస్‌తోపాటు ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు పూర్తి సబ్సిడీ ద్వారా అందించాలని కోరాడు. పంటల సాగుకు సరిపడా విద్యుత్తు ఇవ్వాలని, తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతాంగం ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

