కుర్మల్‌గూడలో కబ్జా పర్వం
200 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ భూములను కాజేసే కుట్రలకు తెరలేపారు. సర్కార్ భూములు అక్రమార్కులకు ఫలహారంగా మారింది.ప్రభుత్వ భూమి కన్పిస్తే చాలు.. ఇంకేముంది భూ మాఫీయా పడగ విపుతోంది
- రూ.200 కోట్ల భూమి హాంఫట్
బడంగ్పేట్, అక్టోబర్ 26ఏకంగా రూ. 200 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ భూములను కాజేసే కుట్రలకు తెరలేపారు. సర్కార్ భూములు అక్రమార్కులకు ఫలహారంగా మారింది.ప్రభుత్వ భూమి కన్పిస్తే చాలు.. ఇంకేముంది భూ మాఫీయా పడగ విపుతోంది. రాత్రికి రాత్రి ప్రీ కాస్టు పెట్టి ప్రహరీలు నిర్మిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. పక్క సర్వే నంబర్లు వేసి రిజిస్టేషన్లు చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తున్నట్లు కన్పిస్తున్నది. కబ్జాదారుల ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. జీహెచ్ఎంసీలో భాగమైన బడంగ్పేట్ సర్కిల్-16లోని కుర్మల్‌గూడలో సర్వే నంబర్ 80/2లో 7 ఎకరాలు, 80/3లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కతం చేయడానికి స్కెచ్ వేశారు. గుట్టు చప్పుడు కాకుండా పక్క సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేసన్లు చేసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. ప్రభుత్వ భూమిలో భవనాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు.
బడంగ్పేట్, అక్టోబర్ 26 : కబ్జాదారుల వెనుకాల అదృశ్య శక్తులు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు లేకపోతే కరెంటు మీటర్లు ఎలా వస్తున్నాయి. డోర్ నంబర్లు ఎలా జారి చేస్తున్నారు. నిర్మాణం చేస్తున్నప్పుడు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో ఎలాంటి రిజిస్టేషన్లు చేయకూడదని రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రార్లకు సర్యూలర్లు జారీ చేసినట్లు చెబుతున్నారు. 22ఏలో ఉన్న భూములను సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్లు చేయడంపై రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా జీపీవోలను, ఆర్ఐలను అప్రమత్తం చేసినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఎంత నిఘా పెట్టినా కబ్జాదారులు బరితెగిస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు, క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే కరెంటు మీటర్లు, డోర్ నంబర్లు జారి కావడంపై ఎవరో అదృశ్య శక్తి ఉన్నట్లు తెలుస్తోందని అధికారులు అనుమానిస్తున్నారు.
చుట్టూ ఫెన్సింగ్ వేసి..
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని కుర్మల్ గూడలో భూబకాసురులు రెచ్చి పోతున్నారు. ఎవరి అనుమతి లేకుండనే ఏకంగా ఇండ్లు నిర్మించారు. చుట్టూ ఫెన్సింగ్ వేశారు. క్షణాల్లో కరెంటు మీటర్లు వస్తున్నాయి. ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు గతంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులను తొలగించేశారు. సెలవు దినాలను ఎంచుకొని నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది. ముందుగానే విద్యుత్ అధికారులతో కరెంటు మీటర్లు తీసుకుంటున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే కరెంటు మీటర్లు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇండ్లు నిర్మిస్తుంటే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం రాగానే రాజకీయ నేతలతో అధికారులకు ఫోన్లు పోతున్నాయి. రాజకీయ నేతలు రెవెన్యూ అధికారులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు జల్పల్లి, మల్లాపూర్, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. అయినా ప్రతి రోజూ కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. భూ మాఫియా పడగ విపుతూనే ఉంటున్నది.
12 ఎకరాలకు ఎసరు
భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ మాఫియా రెచ్చిపోతున్నది. కుర్మల్ గూడలో సర్వే నంబర్ 80/2లో 7ఎకరాలు, 80/3లో 5 ఎకరాల భూమిని అక్రమించుకొని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల విచారణలో వెల్లడైయింది. ఏకంగా 12 ఎకరాలకు ఎసరు పెట్టారు. ఆ భూమి విలువ దాదాపుగా రూ. 200 కోట్లు ఉంటున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 80/3లో 5 ఎకరాల ఏకంగా బోరు వేసి పైపులైన్లు వేసి నేలను సదును చేశారు. సర్వే నంబర్80/2లో 7 ఎకరాలలో చుట్టూ ఫెన్సింగ్ వేయడం, ఇండ్ల నిర్మాణం చేసిన విషయాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. కుర్మల్ గూడ సరిహద్దులో ఉన్న నాదర్గుల్ సర్వే నంబర్లు వేసి కుర్మల్ గూడ రెవెన్యూ భూమిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి రావడంతో శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చి తొలగిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే చర్యలు
బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలో ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మల్లాపూర్ సర్వే నంబర్ 73లో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిని గుర్తించి నోటీలు జారీ చేశాం. కుర్మల్‌గూడ 80/3లో 5 ఎకరాల ఏకంగా బోరు వేసి పైపులైన్లు వేశారు. వాటిని గుర్తించి సీజ్ చేశాం. సర్వే నంబర్80/2లో 7ఎకరాలలో కబ్జాలు అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని కూడా త్వరలోనే తొలగిస్తాం. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం. క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని జీపీవోలకు, ఆర్ఐలను ఆదేశించాం.
– తహసీల్దార్ ఇందిరా దేవి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

