ముంబై, మే 2: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,423 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,933 కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం వృద్ధిని కనబరిచింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8 శాతం ఎగబాకి రూ.7,876 కోట్లకు చేరుకున్నది. మార్చి31తో ముగిసిన ఏడాదికాలానికిగాను బ్యాంక్ అడ్వాన్స్‌లు 16 శాతం, డిపాజిట్లు 15 శాతం చొప్పున పెరిగాయి.