భువనేశ్వర్: భారత యువ అథ్లెట్ కుల్దీప్ కుమార్ జాతీయ పోల్‌వాల్ట్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టించాడు. శనివారం జరిగిన ఇండోర్ ఓపెన్ కంబైన్డ్ ఈవెంట్స్ అండ్ పోల్‌వాల్ట్ కాంపిటీషన్స్‌లో భాగంగా 5.41 మీటర్లు దూకి జాతీయ రికార్డు ప్రదర్శనతో సత్తాచాటాడు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏండ్ల కుల్దీప్.. తన రాష్ర్టానికి చెందిన దేవ్ మీనా రికార్డు (5.40 మీ.)ను అధిగమించి స్వర్ణం గెలుచుకున్నాడు.