ఇబ్రహీంపట్నం : పద్మశ్రీ అవార్డు గ్రహిత, విలక్షణ సీనియర్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) తెలుగు ప్రజల గుండెల్లో స్ధానం సంపదించుకోన్నారని సినీ నిర్మాత అంకతి భరత్ కుమార్ (Producer Bharat Kumar) అన్నారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆదివారం ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామ కూడలి వద్ద కోట చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట ‘ఆహా నా పెళ్లంట’ సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట ప్రతిఘటన చిత్రంతో మంచి గుర్తింపు పొందారన్నారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు మరణం సినిమా రంగంలోనేకాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో తీవ్ర విషాదం నింపిందన్నారు.
నివాళి అర్పించిన వారిలో సినీ ఆర్టిస్టులు రాధరపు ప్రభాకర్, అరె రమేష్, కళాభిమానులు కారం ఇంద్రయ్య, అరె సురేందర్, పుప్పాల రాజేష్, బుక్య కైలాష్, అందుగుల నాగేష్, బస మల్లేశ్, అందుగుల ప్రవీణ్, దోనికెన జగదిష్ తదితరులు ఉన్నారు.