Costa App | చేర్యాల, జనవరి 16 : సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాల్లో ఏనోట విన్నా ‘కోస్తా’ యాప్ గురించి జోరుగా చర్చ జరుగుతున్నది. ‘నేను ఇంత పెట్టుబడి పెట్టా, నువ్వు ఎంత పెట్టావు?’ అనే మాటలే వినిపిస్తున్నాయి. చేర్యాల ప్రాంతంలో ఈ యాప్‌లో సుమారు 6 వేల మంది రూ.కో ట్లల్లో పెట్టుబడులు పెట్టారు. అయితే, మూడు రోజులుగా యాప్ ఓపెన్ కాకపోవడంతో వా రంతా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ యాప్ వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు గురువారం విచారణ ప్రారంభించారు. పెట్టుబడి పెట్టి లాభాలు గడించిన పలువురిని విచారణకు రావాలని పోలీసులు ఫోన్లు చేసినట్టు సమాచారం.
ఈ యాప్‌కు సంబంధించి కార్యాలయం లేదు.. ప్రతినిధులూ లేరు. కానీ, యాప్‌లో పెట్టుబడులు పెడితే వేలల్లో ఆదాయమంటూ ప్రచారం జోరందుకోవడంతో చాలామంది అమాయకులు పెట్టుబడి పెట్టారు. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే మొదట రూ.590 చె ల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా వివరా లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రవేశ రుసుం రూ. 590 లను సైతం రోజుకు రూ.23 చొప్పున ఖాతాలో వేస్తుండటంతో నమ్మిన చాలామంది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పైగా ఆఫర్ పేరిట రూ.99 వేలకు బదులు రూ.69,900 చెల్లిస్తే చాలని యాప్‌లో ప్రకటించడంతో చాలామంది ఆకర్షితులయ్యారు.
ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి కొత్త సభ్యులను చేర్పించేవారికి టీవీ, బైక్, కార్లు లాంటి గిఫ్ట్‌లను ఇస్తున్నట్టు సమాచారం. దీంతో మొత్తం రూ.3 కోట్లకు పైగా పె ట్టుబడి పెట్టినట్టు తెలుస్తున్నది. మూడు రో జులు యాప్ ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడు అందరూ లబోదిబోమంటున్నారు. ఈ విషయమై చేర్యాల ఎస్సై నిరేశ్ను వివరణ కోర గా.. బాధితులు తమను ఆశ్రయించలేదని తె లిపారు. 1930కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆగస్టులో కాశేగుడిసెలకు చెందిన ఓ యువకుడికి మొదట యాప్ లింక్ వచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని చేనేత, మర నేత కార్మికుల మగ్గాలకు ఇప్పటివరకు జియోట్యాగింగ్ కాలేదని తెలంగాణ చేనేత ఐక్యవేదిక పేర్కొన్నది. ఈ నెలాఖరు వరకు వాటికి జియోట్యాగింగ్ చేసి, నంబర్ ఇవ్వాలని రాష్ట్ర చేనేత జౌళి కమిషనర్ శైలజరామయ్యర్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ తెలిపారు. జియోట్యాగింగ్ విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐక్యవేదిక వినతికి కమిషనర్ సానుకూలం గా స్పందించినట్టు పేర్కొన్నారు.